
భార్యకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారంలోకి దింపిన భర్త
పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఒక మహిళ తన భర్త గౌరవ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని, మత్తుమందు ఇచ్చి వ్యభిచారంలోకి దింపాడని ఆరోపించింది. దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ ఘోరం కొనసాగింది. ఇటీవల మత్తులో రోడ్డుపై పడి ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా, స్పృహలోకి వచ్చాక అసలు విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గౌరవ్‌ను అరెస్ట్ చేసి, అనైతిక ట్రాఫిక్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




