ములకలచెరువులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ

1726చూసినవారు
ములకలచెరువులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ
ములకలచెరువు మండలం వేపూరి కోటలో బుధవారం, కూటమి నాయకుల ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ సుగవాసు ప్రసాద్, తంబళ్లపల్లి టిడిపి అబ్జర్వర్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సూచనలతో ఎంపీడీవో హరినారాయణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కె.ఎస్ ఎస్ సభ్యులు, టీడీపీ మార్కిరి ఆంజనేయ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పివి. జయరామిరెడ్డి, కార్యదర్శి మనోహర్, వేపూరి కోట ఎంపీటీసీ శ్రీనివాసులు రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్