శుక్రవారం పీటీఎం మండలం పెద్దతిప్ప సముద్రం పరిధిలో కమ్మచెరువుకు చెందిన నరసింహులు కుమారుడు పి. విశ్వనాథ్ (33) కొబ్బరి చెట్టుపై నుంచి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లెకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.