రామసముద్రం: తన అన్న వల్ల ప్రాణహాని ఉందంటూ తమ్ముడి ఫిర్యాదు

815చూసినవారు
రామసముద్రం మండలం ఏలవ నెల్లూరులో భూ వివాదం నేపథ్యంలో తన అన్న మురళి దాడి చేసి గాయపరిచినట్లు తమ్ముడు దాసరి ఈశ్వర్‌ తెలిపారు. ఈ ఘటనలో ఈశ్వర్‌కు గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడి వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఈశ్వర్, అతని భార్య ప్రియాంక ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్