రామసముద్రం: యువకుడి ఆత్మహత్యాయత్నం

1809చూసినవారు
రామసముద్రం: యువకుడి ఆత్మహత్యాయత్నం
శుక్రవారం సాయంత్రం రామసముద్రం మండలం ఎగువ బొంపల్లె గ్రామానికి చెందిన 21 ఏళ్ల నవీన్ ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలం పనుల నుంచి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు అతడిని అపస్మారక స్థితిలో గుర్తించి, వెంటనే 108 అంబులెన్స్ ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవీన్ పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

సంబంధిత పోస్ట్