కోసువారిపల్లెలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు

9చూసినవారు
కోసువారిపల్లెలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు
తంబళ్లపల్లె మండలం కోససువారిపల్లెలో తాగునీటి సమస్య తీరింది. టిడిపి క్లస్టర్ ఇంచార్జి బేరిపల్లి శ్రీనివాసులు టిడిపి అధిష్టానానికి సమస్యను తెలియజేయడంతో జిల్లా పరిషత్ నుండి రూ. 5 లక్షల నిధులు మంజూరయ్యాయి. కోసువారిపల్లె పాత పంచాయతీ కార్యాలయంలో 2000 లీటర్ల సామర్థ్యంతో ఆర్డబ్ల్యూఎస్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈ వినోద్ కుమార్ ల సహకారంతో ఈ ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దీనితో ప్రతి ఇంటికి కేవలం రూ. 2 బిందె తాగునీరు అందించే కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. సిసి రోడ్లు, తాగునీటి పనులు, పలు అభివృద్ధి పనులకు స్థానిక టిడిపితో పాటు కూటమనేతలు తనకు పూర్తి సహకారం అందించాలని బేరి శ్రీనివాసులు కొనియాడారు.