మంగళవారం రాత్రి తంబళ్లపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్. వెంకటరమణ అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. సొంత పనిపై బైక్‌పై దండువారిపల్లెకు వెళ్తుండగా, దారిలో రోడ్డు పక్కన లైట్లు ఆర్పి నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను గుర్తించలేక ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.