ఆపదలో మహిళలకు రక్షణగా శక్తి యాప్: ఎస్ఐ

602చూసినవారు
ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించడంలో 'శక్తి యాప్' కీలకమని పెద్దమండ్యం ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. శనివారం పెద్దమండ్యం MPDO కార్యాలయంలో నాయకులతో కలిసి మహిళలు, ప్రజలకు ఈ యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ తమ ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో SOS కాల్స్ పనిచేయకపోయినా, లొకేషన్ ఆధారంగా పోలీసులు స్పందించి రక్షణ కల్పిస్తారని ఆయన సూచించారు. ఈ యాప్‌లో సమీప పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్