అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలో శనివారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పెద్దరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు సురపువారిపల్లి, బడికాయలపల్లి పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పరిశీలకులు సురేంద్రనాథ్ మాట్లాడుతూ, సమిష్టి కృషితోనే వైఎస్ఆర్సిపి బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సురపువారిపల్లి, బడికాయలపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులుగా కె. రాజశేఖర్ రెడ్డి, ఏ. సుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.