అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం సిద్దవరం కేజీబీవీ స్కూల్లో ఒక విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ రాణి కుమారి, ఎంఈఓ 2 రామకృష్ణల కనుసన్నల్లోనే స్కూల్ నడుస్తోందని, వారి ఆదేశాలను పాటించకపోతే
ఉద్యోగాలు తీసేస్తామని సిబ్బందిని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. ఈ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని, వారిని వెంటనే తొలగించి పిల్లలను కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.