తంబళ్లపల్లె: గడ్డి మందు తిని ఆవు మృతి

500చూసినవారు
తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవు గడ్డి మందు పిచికారీ చేసిన గడ్డి తినడం వల్ల మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం నీటితొట్టె వద్ద ఆవుకు నీరు తాగించేందుకు తీసుకెళ్లగా, అక్కడ ఉన్న గడ్డి తిన్నట్లు బాధితురాలు ప్రసన్న తెలిపారు. అప్పటి నుంచి ఆవు అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందినట్లు ఆమె పేర్కొన్నారు. పక్క గ్రామానికి చెందిన రైతు రోడ్డుకు ఇరువైపులా గడ్డి మందు పిచికారీ చేశాడని, దాని కారణంగానే ఆవు చనిపోయిందని ఆరోపిస్తూ న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్