తంబళ్లపల్లె: జీపు ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు

1542చూసినవారు
ఆదివారం తంబళ్లపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడ సముద్రం గ్రామానికి చెందిన రైతు బి. కృష్ణప్ప (55) తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బైక్‌పై తంబళ్లపల్లికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఎర్రగుట్టపల్లి సముద్రం పరిధిలోని మద్యమ గుడి వద్ద ఎదురుగా వచ్చిన జీపు బైక్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన రైతును అదే జీపులో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్