తంబళ్లపల్లె: రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించండి

65చూసినవారు
తంబళ్లపల్లె: రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించండి
తంబళ్లపల్లె మండలంలోని వాహనదారులు రోడ్డు భద్రత నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఏ ఎస్ ఐ నజీర్ భాష సూచించారు. శనివారం ఆయన ఎస్సై లోకేష్ రెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె, మదనపల్లి ప్రధాన రహదారిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాల రికార్డులు పరిశీలించి రికార్డులు లేని రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై జరిమానా విధించారు. ఈ సందర్భంగా వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు తో పాటు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్