తంబళ్లపల్లెలో టీడీపీ వేడుకల్లో ఉద్రిక్తత

447చూసినవారు
తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగు తమ్ముళ్ల ప్రవర్తనపై రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆదివారం అసహనం వ్యక్తం చేశారు. వేదికపై ఒక వర్గాన్ని మాత్రమే ఆహ్వానిస్తున్నారనే అభ్యంతరంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ, సభా గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని, వర్గాలను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. హద్దులు మీరి ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్