ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతమే లక్ష్యం: శంకర్ యాదవ్

3చూసినవారు
ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతమే లక్ష్యం: శంకర్ యాదవ్
తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం బుధవారం బి. కొత్తకోటలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రతి గ్రామం–ప్రతి బూత్‌లో పార్టీ కార్యక్రమాలను విస్తరించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత పటిష్టం చేయాలని శంకర్ యాదవ్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్