ములకలచెరువులో రెండు రేషన్ షాపులు సీజ్!.

2098చూసినవారు
ములకలచెరువులో రెండు రేషన్ షాపులు సీజ్!.
ములకలచెరువు మండలంలోని ప్రభుత్వ చౌకధరల దుకాణాలపై కడప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం సాయంత్రం మెరుపు దాడులు నిర్వహించి, రెండు రేషన్ షాపులను సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు హరినారాయణ, టిప్పు సుల్తాన్, మహేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) ఇమ్రాన్ బృందం మండలంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. చౌడసముద్రం, సోంపాళ్యం గ్రామాల్లోని రేషన్ షాపులలో అధికారిక రికార్డుల కంటే అదనంగా 1082 కిలోల బియ్యం, 60.5 కిలోల చక్కెర నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.