ద్విచక్ర వాహనాలు ఎదురెదురు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లె సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి కెఎన్‌ఆర్ కళ్యాణ మండపం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చవటేశ్వరి నగర్‌కు చెందిన రాజేష్ (29), బండపల్లికి చెందిన రెడ్డప్ప (56) తీవ్రంగా గాయపడ్డారు. వారి తల, చేతులు, కాళ్లకు గాయాలవడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ఘటనపై ముదివేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
