
తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జ్ రేసు హోరాహోరీగా పేర్లు
తంబళ్లపల్లె నియోజకవర్గంలో 60 వేలకుపైగా ఉన్న మొరుసుకాపుల ఓట్లు రాజకీయ సమీకరణాలను మరింత రసవత్తరంగా మార్చనున్నాయి. ఈ వర్గం ఓట్లతో ఎవరు ఇంచార్జ్ అవుతారనే దానిపై చర్చ జరుగుతోంది. మొరుసుకాపుల వర్గం తరఫున సీపీ సుబ్బారెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన నరసింహారెడ్డి బలమైన క్యాడర్ను ఏర్పరచుకున్నారు. సుబ్బారెడ్డికి కూడా స్థానిక స్థాయిలో సత్తా ఉందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.



































