ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం, వరి సాగు తగ్గడంతో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. హంస బియ్యం క్వింటాల్‌కు రూ.3,000-4,000, జైశ్రీరాం సన్నరకం రూ.7,000-8,000, హెచ్‌ఎంటీ రూ.6,500-7,000, సోనామసురి రూ.5,200-5,800కు చేరాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చే సన్నరకం బియ్యం దిగుబడి 60% తగ్గే అవకాశం ఉంది. రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మడం కూడా ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.