AP: ఒడిశాలోని పూరీ సమీప సముద్ర జలాల్లో విశాఖపట్నానికి చెందిన మరో చేపల వేట బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బోటులో మొత్తం తొమ్మిది మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. మత్స్యకారులంతా క్షేమంగానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందగా, వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.