‘కల్కి-2’లోకి మరో బాలీవుడ్ యాక్టర్?

3933చూసినవారు
‘కల్కి-2’లోకి మరో బాలీవుడ్ యాక్టర్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి-2’ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక కొత్త నెగటివ్ పాత్రను దర్శకుడు పరిచయం చేయనున్నారని, ఈ పాత్రలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించనున్నారని సమాచారం. అయితే ఆ నటుడు ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. సినీవర్గాల ప్రకారం, ఈ చిత్రానికి ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్