AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. మెరుపులు, ఉరుములతో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పశువుల కాపర్లు, రైతులు, రైతు కూలీలు జాగ్రత్తగా ఉండాలని, చెట్లకిందకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రాబోయే రెండు రోజుల్లో శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.