రాజస్థాన్‌లోని జైపూర్‌లో పారామెడికల్ పరీక్షలో మాస్ కాపీయింగ్‌కు కుట్ర పన్నిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఝున్‌ఝునుకు చెందిన ఒక కాలేజీలో ఫెయిలైన 45 మంది మొదటి సంవత్సరం విద్యార్థులను, జైపూర్‌లోని ప్రభాదేవి మెమోరియల్ కళాశాల కేంద్రంలో అక్రమంగా పాస్ చేయించేందుకు రూ. 5.5 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. నిందితులలో కాలేజీ నిర్వాహకుడు, హెచ్‌ఓడీ, లెక్చరర్, మరో అధికారి ఉన్నారు.