AP: రాష్ట్రంలో మహిళలకు శుభవార్త. స్త్రీల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఇంటింటికీ వెళ్లి రక్తపోటు, మధుమేహం పరీక్షలు ఉచితంగా చేస్తారు. ముఖ్యంగా మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్ నిర్వహిస్తారు. లక్షణాలుంటే, జిల్లా ఆసుపత్రుల్లోని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్‌లో గ్రీన్ ఛానల్ ద్వారా అదే రోజు ఉచిత చికిత్స అందించి ఇంటికి పంపుతారు. ఈ మేరకు వైద్య సిబ్బంది ఇంటింటికీ రాబోతున్నారు.