టీడీపీకి మరో గవర్నర్ పదవి.. మాజీ మంత్రి ప్రతిభాకి ఛాన్స్?

14409చూసినవారు
టీడీపీకి మరో గవర్నర్ పదవి.. మాజీ మంత్రి ప్రతిభాకి ఛాన్స్?
AP: టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉండటంతో సీనియర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రతిభా భారతికి అవకాశం ఇస్తే మహిళా కోటా, ఎస్సీ రిజర్వేషన్ పరిగణలోకి తీసుకున్నట్లు అవుతుంది. ఆమె ఉమ్మడి రాష్ట్రంలో మహిళా మంత్రిగా, శాసనసభ స్పీకర్ గా విశేష సేవలు అందించారు. 1983 నుంచి 1999 వరకు గెలుస్తూ వచ్చారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్