గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

49చూసినవారు
గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ
AP: గ్రూప్‌–1 పరీక్ష వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌కు తరలించాలనే నిర్ణయం ఎవరిదని APPSCని ప్రశ్నించింది. అలాగే, ఆ పత్రాలను హాయ్‌ల్యాండ్‌ నుంచి తిరిగి కమిషన్‌ కార్యాలయానికి ఎప్పుడు తరలించారో వివరించాలంది. బిల్లుల చెల్లింపు వివరాలను కూడా కోర్టు ముందు సమర్పించాలని స్పష్టమైన సూచనలు జారీ చేసింది. జవాబు పత్రాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందజేయాలని APPSCకి ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్