AP: తూ.గో. జిల్లా నల్లజర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వంతెన సమీపంలో మహారాష్ట్ర నుంచి శెనగ పప్పు లోడుతో తాడేపల్లిగూడెం వైపునకు వెళ్తున్న లారీని.. దేవరపల్లి నుంచి నల్లజర్లకు వస్తున్న ఇసుకలోడు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో శెనగపప్పు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయి. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.