AP: బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న మరో అల్పపీడనం కూడా అరేబియా సముద్రం వైపుకు కదులుతుందని పేర్కొంది. వీటి ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.