ఏపీలో త్వరలో మరో కొత్త పథకం

16798చూసినవారు
ఏపీలో త్వరలో మరో కొత్త పథకం
AP: సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పలు కొత్త పథకాలను అమలు చేస్తోంది. త్వరలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో అధిక సంతానాన్ని ప్రోత్సహిస్తూ.. ‘పిల్లలే సంపద’ పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనుంది. మూడో బిడ్డను కనే మహిళలకు డెలివరీ టైంలో రూ.25 వేలు, ఇద్దరి కన్నా ఎక్కువ బిడ్డలను కంటే, ఆ పిల్లలకు 5 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల పోషణ కింద రూ.1000 ఆర్థికసాయం అందించనుంది.

సంబంధిత పోస్ట్