గోదావరి పరివాహక గ్రామాలకు మరో రూ.100 కోట్లు విడుదల

34చూసినవారు
గోదావరి పరివాహక గ్రామాలకు మరో రూ.100 కోట్లు విడుదల
AP: గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో గ్రామీణ రహదారులు, తాగు నీటి సదుపాయాలు కల్పించనున్నారు. రూ.90 కోట్లతో ఏడు నియోజకవర్గాల్లో 141 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రహదారుల నిర్మాణం, రూ.10 కోట్లతో పుష్కరాలకు వచ్చే భక్తులకు రక్షిత తాగునీటి సౌకర్యాలు కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్