ఏపీలో మరో పథకం అమలు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి నేరుగా రూ.25వేలు జమ

51చూసినవారు
ఏపీలో మరో పథకం అమలు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి నేరుగా రూ.25వేలు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో 'నేతన్న భరోసా' పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆప్కో ద్వారా నాణ్యమైన నూలు సరఫరా, ఉచిత విద్యుత్, చేనేత సంఘాల బకాయిల చెల్లింపు, టీటీడీ నుంచి వస్త్రాల ఆర్డర్లు వంటి చర్యలతో చేనేత రంగాన్ని బలోపేతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్