AP: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు
వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా వారి కుటుంబ సభ్యులు, రాజకీయ వారసుల భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. పలువురు
వైసీపీ కీలక నేతల వారసులు ఇతర రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
జనసేన నుంచి అనుకూల సంకేతాలు వస్తే కొందరు వారసులు ఆ పార్టీ వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. సంక్రాంతి తర్వాత ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.