వైఎస్ షర్మిల బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఫైర్ అయ్యారు. షర్మిల మత సంబంధ వ్యాఖ్యలు విస్తృత విధ్వేషాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమెకు ఆర్ఎస్ఎస్ అర్థం తెలియదని, భర్తతో కలిసి స్వయంగా మత మార్పులు చేసిన విషయాన్ని ఉదహరించారు. “ఆలయాలు వద్దు, మరుగుదొడ్లు కట్టండి అని చెప్పగలరా? ముస్లింలు, క్రైస్తవులకు ఇలాగే చెప్పగలరా?” అని మాధవ్ ప్రశ్నించారు. కాగా, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.