ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు ఇలా చేశారు. ఆరోగ్య రంగం రూ.18,421 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు, పట్టణాభివృద్ధి రూ.11,490 కోట్లు, జలవనరులు రూ.16,490 కోట్లు, రోడ్లు, భవనాలు రూ.9,554 కోట్లు, ఇంధన రంగం రూ.8,207 కోట్లు, పోలీసు శాఖ రూ.8,495 కోట్లు, ఉన్నత విద్య రూ.2,326 కోట్లు, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.322 కోట్లు కేటాయించారు.