AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ మేరకు మంత్రులందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సమావేశంలో సీఐఐ సబ్మిట్, మొంథా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాలు, రైతులకు ఇవ్వాల్సిన పరిహారం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే అమరావతి అభివృద్ధి కోసం NaBFID నుంచి రూ.7500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగనుంది.