రేపు మ‌ధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ

7729చూసినవారు
రేపు మ‌ధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ
AP: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే వివిధ బిల్లుల గురించి మంత్రివ‌ర్గం చ‌ర్చించి, ఆమోదం తెల‌ప‌నుంది. మ‌రోవైపు ఎన్టీఆర్ ఆరోగ్య‌శ్రీ ఓపీడీ సేవ‌ల నిలిపివేత‌పై చ‌ర్చించ‌నున్నారు. కాగా, రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.