రేపు ఏపీ కేబినెట్ సమావేశం: భారీ పెట్టుబడులకు ఆమోదం

9100చూసినవారు
రేపు ఏపీ కేబినెట్ సమావేశం: భారీ పెట్టుబడులకు ఆమోదం
రేపు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విశాఖలో రూ.87,520 కోట్లతో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుతో సహా మొత్తం రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. పలు నిర్మాణాలు, సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Job Suitcase

Jobs near you