సింగపూర్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్

73చూసినవారు
సింగపూర్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్
AP: రాష్ట్ర అభివృద్ధిలో విశ్వసనీయ భాగస్వామి సింగపూర్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తన సింగపూర్ పర్యటనపై చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా శనివారం ట్వీట్ చేశారు. ఆదివారం సింగపూర్‌ మంత్రులు, పారిశ్రామికవేత్తలతో తాను భేటీకానున్నట్లు సీఎం వెల్లడించారు. సహకారం, సహవికాసం, శాశ్వత భాగస్వామ్యమే ఎజెండాగా ఈ భేటీ జరుగుతోందన్నారు. అంతర్జాతీయ వేదికపై APకి గుర్తింపు తెస్తామని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్