ఐఐటీ నిపుణుల భాగస్వామ్యంతో ఏపీ అభివృద్ధి: మంత్రి లోకేష్

59చూసినవారు
AP: విజయవాడలో జరిగిన 'పాన్ ఐఐటీ సదస్సు 2026'లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి 23 ఐఐటీలకు చెందిన 5 లక్షల మంది పూర్వ విద్యార్థుల నైపుణ్యాన్ని వినియోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏపీ అభివృద్ధి మంత్రం 'స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ' అని పేర్కొంటూ, ప్రభుత్వ పాలసీల రూపకల్పనలో ఏఐ (AI)ని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పెట్టుబడులే లక్ష్యంగా హార్టికల్చర్ నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు 23 ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, డీప్‌టెక్, క్వాంటం పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్