మద్యం మత్తులో మందుబాబుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన ఒంగోలులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. అయ్యప్ప అనే యువకుడు స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చిన షేక్ అనిల్ బీర్ సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనలో అయ్యప్ప తలకు తీవ్రంగా గాయమైంది. హుటాహుటిన అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అనిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.