AP: ఈఏపీసెట్-2026 (EAPCET) ఫలితాలను ఈ నెల 30న ఉదయం 11 గంటల తర్వాత విద్యాశాఖ మంత్రి నారా
లోకేశ్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూకే అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2.58 లక్షల మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 70,929 మంది పరీక్ష రాశారు. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన అధికారులు, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి రెండు ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.