ఏపీలో లక్షలాది మంది
విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈఏపీసెట్ (AP EAPCET 2026)
ఫలితాలు వాయిదా పడ్డాయి. సీబీఎస్‌ఈ 12వ తరగతి
ఫలితాలు పూర్తిగా వెలువడని నేపథ్యంలో, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికి
ఫలితాలు రావాల్సి ఉండగా, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ, ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, సీబీఎస్‌ఈ రివైజ్డ్
ఫలితాలు పూర్తిగా వచ్చేవరకు ఆగడం వల్ల జాప్యం జరిగింది.
ఫలితాలు గురువారం వెలువడే అవకాశం ఉంది.