ఏపీకి వాయుగుండం ముప్పు

20905చూసినవారు
ఏపీకి వాయుగుండం ముప్పు
ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బుధవారం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని APSDMA తెలిపింది. ఇది 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.