ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తాజాగా వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రైన్ అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.