నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ సర్కార్ యాప్

78చూసినవారు
నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ సర్కార్ యాప్
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం తయారీని అరికట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించడానికి ఒక మొబైల్ యాప్‌ను తీసుకురానున్నట్లు CM చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై ఉన్న హోలోగ్రామ్‌ను స్కాన్ చేస్తే అది అసలైనదా లేక నకిలీదా అని తెలిసిపోతుంది. ఈరోజు ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :