AP: ఎరువుల అక్రమ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 2,845 టన్నుల ఎరువులు స్వాధీనం చేసుకుని, 191 కేసులు నమోదు చేశారు. ఎరువుల అక్రమార్కులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.