ఏపీలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేయించుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పీఎం కిసాన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని తెలిపింది. సమీప రైతు సేవా కేంద్రాల్లో ఆధార్, పట్టాదారు పాసు పుస్తకంతో నమోదు చేయించుకోవాలని కోరింది.