రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రజల సూచనలు కోరిన ఏపీ ప్రభుత్వం

4765చూసినవారు
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రజల సూచనలు కోరిన ఏపీ ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన రుషికొండ ప్యాలెస్‌లను ఎలా వినియోగిస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని ఏపీ టూరిజం అథారిటీ కోరింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలను rushikonda@aptdc.inకు మెయిల్ చేయాలని సూచించారు. ఈ నెల 17వ తేదీన జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశంలో వారు కూడా సూచనలు చేయవచ్చని తెలిపింది.