AP: తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ప్రకటన

74చూసినవారు
AP: తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ప్రకటన
AP: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఏకాదశి సందర్భంగా సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రెయిలింగ్ ఊడిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుని, ఘటనాస్థలంలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించినట్లు వెల్లడించారు. మొత్తం 13 మందికి గాయాలయ్యాయని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్