AP: పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని, అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. సహాయక చర్యల విషయంలో ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ కలిసి పనిచేయాలని, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. హెల్ప్ లైన్ నెంబర్ 0863-2340678, వాట్సప్ నెంబర్ 85000 27678 అందుబాటులోకి తెచ్చారు.